గుడిగంటలు మ్రోగినవేళ సాంగ్ లిరిక్స్ నిన్నే ప్రేమిస్తా (2000) తెలుగు సినిమా


Album:Ninne Premistha

Starring:Nagarjuna, Srikanth, Soundarya
Music:S. A. Rajkumar
Lyrics-Ghantadi Krishna
Singers :Rajesh, Chitra
Producer:R. B. Choudary
Director:R. R. Shinde
Year: 2000





గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది 
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది  
ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం 
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

నా చిరునవ్వయి నువ్వే ఉండాలి ఉండాలి
నా కనుపాపకు రెప్పయి వుండాలి ఉండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి ఎదగాలి ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై  నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టయి నాలో నువ్వు ఏకమవ్వాలి 
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి కావాలి కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి కావాలి కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వయి కమ్మని కోకిల పాటవు నువ్వయి
చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి 

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
సడి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది  

ఆ దేవుని పూజకు నువ్వొస్తే ఆ దేవిని చూడగ నేనొస్తే అది ప్రేమకు శ్రీకారం 
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)