ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా పెద్దరికం (1992)



Starring:Jagapathi Babu, Sukanya
Music :Raj Koti
Lyrics-Bhuvanachandra
Singers :S.P.Balu, Chitra
Producer:A M Ratnam
Director:A M Ratnam
Year:1992




ప్రియతమా ప్రియతమా తరగనీ పరువమా
తరలిరా తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా నిండు కౌగిళ్ళలో చేర రావే 

ప్రియతమా ప్రియతమా తరగనీ విరహమా
కదలిరా  కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. ఓఓ తరలిరా

నీ ఆశలన్నీ నా శ్వాసలైనా .. ఎంత మోహమో
ఓ ఓ ఓ .. నీ ఊసులన్నీ నా బాసలైనా .. ఎంత మౌనమో
ఎవరేమి అన్నా ఎదురీదనా .. ఆ ఆ ఆ
సుడిగాలినైనా ఒడి చేరనా .. ఓ ఓ ఓ ఓ
నీడల్లే నీ వెంట నేనుంటా .. నా ప్రేమ సామ్రాజ్యమా

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా

పెదవుల్ని తడితే పుడుతుంది తేనే .. తియ తియ్యగా
ఓ ఓ ఓ .. కౌగిట్లో పడితే పుడుతుంది వానా .. కమ్మ కమ్మగా
వెన్నెల్ల మంచం వేసెయ్యనా .. ఓ ఓ ఓ ఓ
ఏకాంత సేవా చేసేయనా .. ఓ ఓ ఓ ఓ
వెచ్చంగ చలి కాచుకోవాలా .. నీ గుండె లోగిళ్ళలో

ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా  నిండు కౌగిళ్ళలో చేర రావే
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా

కదలిరా .. కదలిరా
Share This :



sentiment_satisfied Emoticon