కృష్ణం వందే జగద్గురుం..సాంగ్ లిరిక్స్ కృష్ణం వందే జగద్గురుం (2012) తెలుగు సినిమా



Album:Krishnam Vande Jagadgurum

Starring:Rana Daggubati, Nayantara
Music :Mani Sharma
Lyrics-Seetharama Sastry
Singers :SP Balu
Producer:Y Rajeev Reddy, Sai Babu Jagarlamudi
Director:Krish
Year:2012






జరుగుతున్నది జగన్నాటకం...
జరుగుతున్నది జగన్నాటకం...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం.
నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం. 

చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించునని
ధర్మమూలమే మరిచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చోపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం.

చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
క్షీర సాగర మధన మర్మం.

ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగనురికే ఉన్మాదమ్మును
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉధ్ధరించగల
ధీరోధ్ధతి రణ హుంకారం... ఆదివరాహపు ఆకారం.

ఏడీ ఎక్కడరా.. నీ హరి దాక్కున్నాడేరా భయపడి 
బయటకి రమ్మనరా ఎదుటపడి... నన్ను గెలవగలడా... తలపడి
నువు నిలిఛిన ఈ నేలను అడుగు... నీ నాడుల జీవజలమ్మును అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు... నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అణువుల ఆకాశన్నడుగు.. నీలో నరునీ హరినీ కలుపు
నీవే నరహరివని నువు తెలుపు.

ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి 
హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి
అఘము నగమై ఎదిగే అవనికిదె అశనిహతి. 
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి
శితమస్తి హత మస్తకారి నఖ సమకాశియో
క్రూరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం.

అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం
కుబ్జాక్రుతిగా బుధ్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతొ కొలిచే త్రైవిక్రమ విస్తరణం.
జరుగుతున్నది జగన్నాటకం.... జరుగుతున్నది జగన్నాటకం.

పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై భయదభీముడై ధర్మాగ్రహ విగ్రహుడై నిలఛిన
శోత్రియ క్షత్రియ తత్వమె భార్గవుడు.

ఏ మహిమలూ లేక ఏమాయలూ లేక నమ్మశక్యము కాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే.

ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్న పరిచితునిగా
దర్శింప జేయగల జ్ఞానదర్పణము... కృష్ణావతారమే.. సృష్ట్యావరణ తరణము.

అనిమగా, మహిమగా, గరిమగా, లఘిమగా, 
ప్రాప్తిగా, ప్రాకామ్యవర్తిఘా, ఈశత్వముగా, వశిత్వమ్ముగా
నీలోని అష్టసిధ్ధులూ నీకు కనపట్టగా... సస్వరూపమే.. విశ్వరూపమ్ముగా...
నరుని లోపల పరునిపై దృష్టి బరుపగా తలవంచి 
కైమోడ్చి శిష్యుదవు నీవైతే నీ ఆర్తి కడదేర్చు ఆచార్యుడవు నీవే.....
వందే కృష్ణం జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం....
కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం....
వందే కృష్ణం జగద్గురుం.... వందే కృష్ణం జగద్గురుం....
కృష్ణం వందే జగద్గురుం.... కృష్ణం వందే జగద్గురుం....
కృష్ణం వందే జగద్గురుం..



Share This :
avatar

what a great lyrics.. and thanks for giving without any error..

delete 23 February 2022 at 04:52



sentiment_satisfied Emoticon