అరె చిలకమ్మా చిటికేయంటా సాంగ్ లిరిక్స్ దళపతి (1991) తెలుగు సినిమా


Album:Dalapathi

Starring:Rajinikanth, Mammootty, Arvind Swamy,
Srividya, Bhanupriya, Shobana
Music :Ilaiyaraaja
Lyrics-Raja Sri
Singers :Sp Balu, Chitra
Producer:G. Venkateswaran
Director:Mani Ratnam

Year: 1991










అరె చిలకమ్మా చిటికేయంటా  
నువ్వు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట 
నీ సరదాలే రేగాలంట 

ఓ చిన్నోడా పందిరి వెయ్యరా 
ఓ రోజా పువ్ మాలే తేరా
ఈ చినదాని మేడలో వేయరా 
నడిరేయంతా సందడి చేయరా 
అహ టక్కరి గాడే 
అహ ఈ బుల్లోడే 
నను కట్టివేసే మొనగాడే లేడే

అరె చిలకమ్మా చిటికెయ్యంగ 
నువ్వు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్యరా 
ఓ రోజా పువ్ మాలే తేరా

చీకు చింత లేదు చిందులేసే ఊరు 
పాట ఆటా ఇది ఎందంట
ఊరిలోని వారు ఒక్కటైనారు 
నీకు నాకు వరసేనంట
పండగ నేడే మన ఊరికే 
ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే
అందరికింక వ్యధ తీరేనే 
అహ ఈ పుట కానీరా ఆట పాట

బుల్లెమ్మ నవ్విందంట 
మణి ముత్యాలే రాలేనంట 
అరె మావయ్య రేగాడంట 
నా మనసంతా దోచాడంట
నీ మాటే నాకు ఓ వెండి కోట
నువ్ నాదేనంట  నీతోనే ఉంటా

అరె చిలకమ్మా చిటికెయ్యంగ 
నువ్వు రాగాలే పాడాలంట
అరె మావయ్య రేగాడంట 
నా మనసంతా దోచాడంట

వేడుకైన వేళ వెన్నెలమ్మ లాగా 
దీపం నీవై వెలగాలంట
అహ చీకటంత పోయే పట్ట పగలాయే 
ఏల దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే 
నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే 
కోరికలన్నీ రేపే తీరెనే
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా

చిట్టెమ్మ నన్నే చూడు 
జత చేరమ్మా నాతో పాటు
మురిపాల పండగ పూట 
మన ముచ్చట్లే సాగాలంట

బంగారు పరువం పలికే ఈ వేళ గుసగుసలు
పడుచు కలలే వాగులై పారేనే మహదానందం 
చిలిపి కధలన్నీ మురిపించెను
మరిపించెను ఆదమరిచే
మూగమనసులే వెన్నెలని కురిపించేనే
ముగామనసులే వెన్నెలని కురిపించేనే

అరె చిలకమ్మా చిటికెయ్యంగ 
నువ్వు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్యరా 
ఓ రోజా పువ్ మాలే తేరా
అహ నువ్వు సై అంటే ని తోడై వుంటా
అహ నీ కల్లలోనా నే కాపురముంటా  

అరె చిలకమ్మా చిటికెయ్యంగ 
నువ్వు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వెయ్రా 
ఓ రోజా పువ్ మాలే తేరా 

Share This :



sentiment_satisfied Emoticon