Album: Vasantam
Starring:Venkatesh,Aarti Agarwal, Kalyani
Music :S. A. Rajkumar
Lyrics-Kulasekhar
Singers :Hariharan, Sujatha
Producer:N V Prasad
Director:Vikraman
Year: 2003
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్నసత్యం
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
నిషాకళ్ళతోటి వలే వేయకమ్మా
అరే చిక్కుకోదా ఎదే చేపగా
వయ్యారాల వైపు అలా చూడకయ్యా
సిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వే కాని పువ్వు అయితే నేను తుమ్మెదవుతా
నువ్వే కాలిమువ్వ అయితే నేను రాగమవుతా
నిన్నే దాచుకుంటాలే ప్రియా గుండె కోవెల్లోన
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖీ
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
ప్రియా నిన్ను చూసి మదే మారిపోయే
అదేం మాయెగాని వానవిల్లుగా
చెలీ నిన్ను చేరి ఎడారైన గానీ
వసంతాలు జల్లే పూలవెల్లువ
నువ్వే నిద్దరోతే తే నేను జోలపాటనవుతా
నువ్వే దగ్గరయితే హాయి లోన తేలిపోతా
చెలీ నువ్వు అవునంటే సరాగాల సంభరమవుతా
నువ్వు నేను ఏకమై ఇపుడే మనమవుదాం
నింగినేల సాక్షిగా ఎపుడూ ఒకటవుదాం
అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా
రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కలలోన నిన్నుచూసి మనసార కోరకున్న
ఇలలోన ఇంతలోన ఎదురైతే చేరుకున్నా
నాలో ఏదో సవ్వడి ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది
comment 1 comments:
more_vertGood lyrics
sentiment_satisfied Emoticon