వెన్నెలమ్మ నీతో సాంగ్ లిరిక్స్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ (2013) తెలుగు సినిమా


Album: Back Bench Student

Starring:Mahat Raghavendra, Piaa Bajpai, Archana Kaviare
Music:Sunil Kashyap
Lyrics-Dinakar
Singers :Dinakar
Producer:MVK Reddy
Director:Madhura Sreedhar
Year: 2013







వెన్నెలమ్మ  నీతో 
జాబిలమ్మ నీతో 
నింగి వెండి చుక్కలన్నీ నీతో 
చల్లగాలి చేసే అల్లరంతా నీతో 
జాబిలమ్మ జోలపాట నీతో 
ఇలా ఇలా ఇలా ఇలా ఉన్నాయి 
నా ఈ తోడు నీతో 

ఆటు పోటు లన్ని అందమైన అలలే పున్నమంటి జీవితాన 
చాటునున్న సుఖమే కెరటమల్లె ఎగసే నిన్ను చేరు ఎన్నడైనా
జాబిల్లి సంద్రములో చూడు గజిబిజిగా ఉంటుంది
నీకోసం ఆ ఆకాశం ఎంత చోటైనా ఇస్తుంది
చిన్న జీవితం ఓ తెల్ల కాగితం హరివిల్లే సంతకం ఓఓఓ 

వెన్నెల్లమ నీతో 
జాబిలమ్మ నీతో 
నింగి వెండి చుక్కలన్నీ నీతో 

మళ్ళి మళ్ళి రాదు  నిన్న రేపు కాదు ఆశలేని నేడు లేదు
అమ్మ ముద్ద తోడు నాన్న ముద్దు తోడు నేస్తమల్లే నన్ను చూడు
విరబూసే ఆ నవ్వుల్నీ పెదవంచును దాటించేస్తే
బరువంతా ఎగిరెళ్ళి నీ మనసే తేలిక కాదా
ఆనందనం ఈ ఉన్న జీవితం ఎగిరే గువ్వలా 

వెన్నెల్లమ నీతో 
జాబిలమ్మ నీతో 
నింగి వెండి చుక్కలన్నీ నీతో 
చల్లగాలి చేసే అల్లరంతా నీతో 
జాబిలమ్మ జోలపాట నీతో 
ఇలా ఇలా ఇలా ఇలా ఉన్నాయి 
నా ఈ తోడు నీతో 
Share This :



sentiment_satisfied Emoticon