చిన్ని తండ్రి నిను చూడగా సాంగ్ లిరిక్స్ సిసింద్రీ (1995) తెలుగు సినిమా



Album: Sisindri

Starring:Nagarjuna Akkineni, Tabu
Music : Raj
Lyrics-Sirivennela Sitaramasastri
Singers : Swarnalatha
Producer:Nagarjuna Akkineni
Director:Sivanageswara Rao
Year: 1995









చిన్ని తండ్రి నిను చూడగా
వెయ్యి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళూ చూస్తుండగా
నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా
చిన్ని తండ్రి నిను చూడగా
వెయ్యి కళ్ళైన సరిపోవురా

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రీల చిందు చూడు
పిలిచినా పలకడు
వెతికినా దొరకడు
మా మధ్య వెలిశాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు
చిన్ని తండ్రి నిను చూడగా
వెయ్యి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళూ చూస్తుండగా
నీకు దిష్టెంత తగిలేనురా

ఆ మువ్వ గోపాలుళ్ళా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగోవై మోగుతుంటే
మనసున నందనం విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా

మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు

చందమామ చూశావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే
చందమామ చూశావటోయ్ అచ్చు నీలాంటి మా బాబుని
Share This :



sentiment_satisfied Emoticon