వల్లంకి పిట్ట సాంగ్ లిరిక్స్ గంగోత్రి (2003) తెలుగు సినిమా


Album Gangotri 

Starring: Allu Arjun, Aditi Agarwal
Music :M.M. Keeravani
Lyrics-Chandrabose
Singers :kousalya, Aiswarya
Producer:Allu Aravind, C. Ashwini Dutt
Director:K. Raghavendra Rao
Year: 2003










వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా 
చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా 
తను నవ్విందంటే ఇంకేమి కావాలి నిద్దరోతూ ఉంటే తను పక్కనుండాలి 
ఈ బంగారు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి 

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా 
చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా 

గరిసనిసమగరిస గరిసనిసమగరిస 
సగమనినిపమగ సగమనినిపమగమ 
ప్పప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిస ప్పప్పా మగమ్మామ్మా గసగ్గాగ్గా సనిస

చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి 
బుడి బుడి అడుగులలు వేసే వేళ హంస దిష్టి 
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిల్లి దిష్టి 
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి 
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి 
ఏ దిష్టి తనకు తగలకుండ నువ్వే చూడాలి 

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా 
చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంటా 

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా 
ఆకలేయగా బుల్లి బొజ్జలో దొంగనవుతా 
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా 
ఎక్కెక్కి ఏడ్చే వేళ కన్నీళ్ళవుతా 
నేస్తాన్నవుతా గురువు అవుతా 
పనిమనిషి తనమనిషవుతా 

నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి 
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా 
మా మంచి పాట సింహాద్రి పాట మనసార వినమంటా 
తను తియ్యని పాటే అమ్మ పాడే లాలి 
తన తోడే ఉంటే అది దీపావళి 
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి 

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగ రమ్మంటా 
మా మంచి పాట సింహాద్రి పాట మనసార వినమంటా 

Share This :



sentiment_satisfied Emoticon