Album:Premikula Roju
Starring:Kunal, Sonali Bendre
Music :A. R. Rahman
Lyrics-M. Rathnam, shiva Ganesh
Singers :Unni Menon
Producer: A. M. Rathnam
Director:Kathir
Year: 1999
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి
కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు
లేకుండ పోయింది
నీ ధ్యాసే అయ్యింది
తలపు మరిగి రేయి పెరిగి
ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
క్షణక్షణం నీ తలపుతో
తనువు చిక్కి పోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
నీకు సాటి ఏది ప్రియతమా
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలక చిలకా..
నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలుక
అజంతా సిగ్గులు ఒలికే
రోజే నిను నేను చేరుకోనా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక..
నోట మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు
నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
జక్కన కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నెగా వచ్చిందంటా చెలియా..
నీ సొగసుకేది సాటి
వాలు కనులదానా…
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైనా
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే
ఓ నోట మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
comment 4 comments:
more_vert2023 lo kotha ga vinnattundhi
Super👍
Amazing song after 23 years also no one forgot
Lovable🤍
sentiment_satisfied Emoticon