అత్తారింటికి దారేది?


ఒక సంవత్సరం వానలు ఉధృతంగా పడడంతో యమున నది పొంగి పొర్లింది. రాత్రి అంతా నిశబ్దంగా ఉండగా యమున నది హోరు చాలా గట్టిగా వినిపించింది.
యమున నది తీరంలో ఉన్న అక్బర్ భవనంలో రాత్రి మహారాజుకి ఆ హోరు నది ఎడుస్తున్నట్టు అనిపించింది. అక్బర్ కి నిద్రాభంగం కలిగింది. చాలా సేపు కిటికీ దెగ్గర నిలబడి, “ఇదేమిటి, యమునా నది ఇంత గట్టిగా ఎడుస్తోందిఅనుకున్నాడు. ఎంత సేపు ప్రయత్నించినా నిద్రపోలేక పోయాడు.
మరునాడు సభలో సభికులందరికి రాత్రి జరిగిన విషయము చెప్పి, “మీలో ఎవరైన యమునా నదికి కలిగిన కష్టమేమిటో చెప్ప గలరా?” అని అడిగారు.
సభికులు తెల్లబోయి, సమాధానము తోచక ఒకరి మొఖం ఒకరు చూసుకుని మిన్నకుండిపోయారు.
బీర్బల్ ముందుకొచ్చి, “మహారాజా, ఒక సారి వింటే కాని నేను చెప్పలేనుఅని అన్నాడు.

అక్బర్ వెంటనే బీర్బల్ ని ఆ రాత్రి అంతఃపురంకి రమ్మని ఆహ్వానించాడు.
రాత్రి బీర్బల్ అక్బర్ గదిలో కిటికీ దెగ్గర నిలబడి ఆ యమునా నది హోరును విన్నాడు.
విషయం అర్ధమయ్యింది.

మహారాజా, యమునా నది తన తండ్రి హిమాలయ పర్వతాన్ని వదిలి తన అత్తరిల్లు (సముద్రం) దారి వెతుక్కుంటూ వెళ్తోంది. తండ్రిని, పుట్టింటిని వదిలి వెళ్తున్నందుకు దుఖంతో ఎడుస్తోంది.అని మరునాడు సభలో విశ్లేషించాడు.సభికలందరూ ఈ విషయం విని బిగపట్టిన ఊపిరి వదిలారు.
Share This :



sentiment_satisfied Emoticon