దాయి దాయి దామ‌ సాంగ్ లిరిక్స్ ఇంద్ర (2002) తెలుగు సినిమా


Album :Indra

Starring: Chiranjeevi, Arthi Aggarval, Sonali Bindre
Music :Mani Sharma
Lyrics-Sirivennela Sitaramasastri
Singers :KK & Mahalakshmi Iyer
Producer: C.Aswini Dutt
Director: B.Gopal


Year: 2002
దాయి దాయి దామ‌
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ

దాయి దాయి దామ‌
పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా
నా నిండు చందమామ
ఓహో హో... ఒళ్లో వాలుమా
ఓహో హో... వయసే ఏలుమా
నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లై తరిమేసే సరసాల కొంటెతనమా
దాయి దాయి దామ‌
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ‌
పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా
నా నిండు చందమామ

టకటకమంటూ తలపును తట్టి తికమక పెట్టే లకుముకు పిట్ట నిను వదిలితె ఎట్టా??
నిలబడమంటూ నడుమును పట్టి కితకితపెట్టే మగసిరి పట్టా కథ ముదిరితే ఎట్టా??
కేరింతలాడుతు కవ్వించలేదా కాదంటే ఇపుడు తప్పేదెలా కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా ఇందుడుకు బాబు ఆపేదెలా అయ్యో ఇందుడుకు బాబు ఆపేదెలా
ఓహో ఓ హొ ఓ కోరిందే కదా
ఓహో ఓ హొ ఓ మరీ ఇంతిదా
మరి కొంచెం అనిపించే ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం సృతి మించే సుకుమారి బెదరిపోదా
హాయె హాయె హాయె అరెరె పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే

పురుషుడినిట్టా ఇరుకునపెట్టే పరుగులు పరువా సొగసుల దరువా ఓ తుంటరి మగువా
నునుపును ఇట్టా ఎదురుగ పెట్టా ఎగబడలేవా తగుజత కావా నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరి ఆ కల్యాణ ఘడియ రానీయవా కల్యాణ ఘడియ రానీయవా
అందాక ఆగదు ఈ అల్లరి నీ హితబోధలాపి సృతి మించవా హితబోధలాపి సృతి మించవా
ఓహో ఓ హొ ఓ వాటం వారెవా
ఓహో ఓ హొ ఓ ఒళ్లో వాలవా
అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యో నీ పడుచు పదును పైనా
దాయి దాయి దామ‌
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
హాయె హాయె హాయి
కొరికే కళ్లు చెదిరిపోయి
ఐనా అది కూడా ఏదో కొత్త కొంటె హాయి
Share This :sentiment_satisfied Emoticon