షడ్రుచుల ఉగాది సాంగ్ లిరిక్స్ ఉగాది పాటలు (2018) | తెలుగు పండుగలు



Lyrics-Rambabu Gosala
Singers :Surabhi Sravani
Producer:Gouribhatla Varun Kumar 
Director:Rahul Machineni
Year: 2018





చైత్ర మాస సూరీడే చుర చుర చూసెనులే
తెల తెల తెలవారే ఉదయంలో మిల మిల మెరిసెనులే
చిగురులు కొరికిన కోయిలలు కు కు కు పాడేనేలే
పచ్చని పల్లెలు పరవశమై జిలుగులు తొడిగెనులే
మావి పూతలు పూచే మల్లె రెమ్మలు విరిచే
ఇంతలో వసంతం వచ్చే రెండు కన్నులకు వర్ణాలోచ్చే
పుల్ల మామిళ్ళు వచ్చే వేప పువ్వులు పూచే
ముంగిట కళ్ళాపి చల్లే రంగు ముత్యాల ముగ్గుల ముగ్గే వేసే

పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల  సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది
శుభకర మధుకర దినకర సురుచిర
సుమధుర సిరివర గిరిధర అదితర
హరిహర నరహర శశిధర 
కారాహార భవహార మొలహార
శ్రీకర సురవర
శుభకర మధుకర దినకర సురుచిర
సుమధుర సిరివర గిరిధర అదితర
హరిహర నరహర శశిధర 
కారాహార భవహార మొలహార
శ్రీకర సురవర

మంచు తెరనే తెంచుకొచ్చే
వెచ్చనైన రవి కిరణం
నీలి మేఘం నేల వాలే
పైరు పంపే ఆహ్వానం
గుమ్మా గుమ్మనా గున్నమామి తోరణాలు
గడప గడపలో శ్రీ లక్ష్మి స్తోత్రాలు
పాడి పంటలతో అలరాడు మన ఊళ్లు
పాలపొంగులు నురగలు తెలుగింటి లోగిళ్ళు

పచ్చని చిగురుతో వెచ్చని వెలుగుతో
పచ్చడి రుచులతో  వచ్చే వచ్చేలా
ఉగాది వచ్చెనులే
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల  సమ్మేళనమే ఉగాది.......
తెలుగోళ్ల సవంత్సరాది

ఆరు రుచుల అమృతములే
తెలుగు తాయిలమే ఇదిలే
కమ్మనైన అమ్మ తనమే 
మనకు పంచె పండుగలే
కొత్త పంచాంగ శ్రవణాల సందడులు
కోటి ఆశలతో మన  రాశి ఫలితాలు
సీత రాముల గాథల్లో సారములు
రాధాకృష్ణుల  లీలలు వింటుంటే  మధురాలు
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల  సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది
పులుపు వగరు తీపి కారం చేదు ఉప్పు
షడ్రుచుల  సమ్మేళనమే ఉగాది.......
తెలుగోల్ల సవంత్సరాది

శతాయుర్వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ |
సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం || 
త్వామలోక నరాభీష్ట మధుమాస సముద్భవ |

పిబామి శోక సంతాప్తాం మమసోకం సదాకురు ||
Share This :



sentiment_satisfied Emoticon