వెన్నెలింత వేడిగా సాంగ్ లిరిక్స్ తులసి (2007) తెలుగు సినిమా



Album:Tulasi


Starring:Venkatesh, Nayantara
Music:Devi Sri Prasad
Lyrics-Chandrabose
Singers:Sunitha Upadrashta,Venu
Producer:D.Suresh Babu
Director:Boyapati Srinu
Year:2007




వెన్నెలింత వేడిగా

ఎండ ఇంత చల్లగా

ఉండేలాగ చేశావే ఓ ప్రియా


చేదు ఇంత తియ్యగా

బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావే ఓ ప్రియా


చీకట్లో సూరీడు

పొద్దున్నేమో జాబిల్లి

వచ్చాయే నువ్వే నవ్వంగా


నేలపై మేఘాలు

ఆకాశంలో గోదారి

చేరాయే నువ్వే చూడగా


వెన్నెలింత వేడిగా

ఎండ ఇంత చల్లగా

ఉండేలాగ చేశావే ఓ ప్రియా


చేదు ఇంత తియ్యగా

బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావే ఓ ప్రియా


నా పేరే అనుకుంటూ

నీ పేరు నేను రాసానే

నా రూపే అనుకుంటూ

నీ రూపు నేను గీసానే


తీయంగా తీవ్రంగా

ఏదో ఏదో అవ్వంగా

ప్రేమంటూ కానే కాదంట


మెత్తంగా కొత్తంగా

ప్రేమను మించే పదమింక

మన జంటే కనిపెట్టాలట


వెన్నెలింత వేడిగా

ఎండ ఇంత చల్లగా

ఉండేలాగ చేశావే ఓ ప్రియా


చేదు ఇంత తియ్యగా

బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావే ఓ ప్రియా


గాలైన నిను చుడితే

ఎనలేని ఈర్ష్య కలిగిందే

నేలైన నిను తడితే

ఎదలో అసూయ పెరిగిందే


గాఢంగా గర్వంగా

జోడి మనమే కట్టంగా

ఏడే జన్మలు సరిపోవంట


దేవుళ్ళే మనకోసం

పగలు రేయి పనిచేసి

ఎన్నో జన్మలు సృష్టించాలంట


వెన్నెలింత వేడిగా

ఎండ ఇంత చల్లగా

ఉండేలాగ చేశావే ఓ ప్రియా


చేదు ఇంత తియ్యగా

బాధ కూడా హాయిగా

ఉంటుందని నేర్పావే ఓ ప్రియా

Share This :



sentiment_satisfied Emoticon