చిత్రం: ప్రేమించేది ఎందుకమ్మా (1999)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: సిరివెన్నెల
గానం: యస్. పి. బాలు
నటీనటులు: అనిల్ కుమార్ మేక , మహేశ్వరి
దర్శకత్వం: జాన్
నిర్మాత: క్రాంతికుమార్
చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందిచేదెపుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వే దెపుడమ్మా
చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
అదుపులేని పరుగా ఇది
కదలలేని పదమా ఇది
ఏమోమరి ఈ సంగతి
కలల లయల పిలుపా ఇది
చిలిపి తలపు స్వరమా ఇది
ఏమోమరి యద సవ్వడి
మాటైన రానంత మౌనాలా
ఏ బాషకి రాని గానాలా
మన జంటె లోకంగ మారాలా
మన వెంటే లోకాలు రావాలా
బదులియ్యవా ప్రణయమా
శ్వాస వేణువై సాగినా
వేడి వేసవై రేగినా
భారం నీదే ప్రియ భావమా
ఆశకి ఆయువై చేరినా
కలల వెనకనే దాగినా
తీరం నువ్వే అనురాగమా
దూరాన్ని దూరంగ తరిమేసి
ఏకాంతమే ఏలుతున్నామా
ఊహల్లో కాలాన్ని ఉరివేసి
గాలుల్లో ఊరేగుతున్నామా
తెలిసేనా ఓ ప్రియతమా
చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందిచేదెపుడమ్మా
మువ్వై నువ్వు నాలో నవ్వే దెపుడమ్మా
చిన్ని పాదాల చినుకమ్మా
స్వాతి ముత్యాలు చిలుకమ్మా
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మా
ఓ చిన్నారి చినుకమ్మా
నువ్వు కరిగేది ఎపుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుడమ్మా
నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని
చెప్పేవారు చూపేవారు ఎవరమ్మా
తన తడి తెలియదె తనకైనా
ఓ చిన్నారి చినుకమ్మా
నువ్వు కరిగేది ఎపుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుడమ్మా
ఊపిరే ఆవిరై వేగుతున్నదో
గుండెలో మబ్బులే కమ్ముకున్నవో
తెలిసేదెలా చినుకమ్మకి
వాకిట వేకువే వచ్చి ఉన్నదో
కాటుకే చీకటై ఆపుతున్నదో
తేలేదెలా చిలకమ్మకీ
ఈ జన్మ ఖైదెవరు వేసారో
నీ వీధి తలుపెవరు మూసారో
గాలైన కదపందే తెలిసేనా
కనురెప్ప విడకుండ తెలిసేనా
మెలకువనె నిదరనుకొనే
ఓ చిన్నారి చినుకమ్మా
నువ్వు కరిగేది ఎపుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుడమ్మా
నిత్యము చేదు జ్ఞాపకాలలో
హొరునె వింటు ఉన్న జీవితం
తేలేదెలా గుండె సవ్వడి
నిన్నటి నీడలే నిండి పోయిన
చూపులో ఎక్కడ చోటులేనిదే
చేరేదెలా రేపులన్నవి
నిట్టూర్పులే ఊపిరనుకుంటే
మునిమాపులే తూర్పులనుకుంటే
ఏ అమృతం జంటకొస్తుంది
ఏ నమ్మకం కంటపడుతుంది
బ్రతుకంటె గతమనుకొనే
ఓ చిన్నారి చినుకమ్మా
నువ్వు కరిగేది ఎపుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుడమ్మా
నీళ్ళల్లోని చేపకి కన్నీళ్ళొస్తున్నాయని
చెప్పేవారు చూపేవారు ఎవరమ్మా
తన తడి తెలియదె తనకైనా
ఓ చిన్నారి చినుకమ్మా
నువ్వు కరిగేది ఎపుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుడమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon