పరువాల పావురమా (నీకోసమే నేనున్నదీ) సాంగ్ లిరిక్స్

 

చిత్రం: దీవించండి (2001)

సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్

సాహిత్యం: 

గానం: యస్.పి.బాలు,చిత్ర





పరువాల పావురమా 

పైటున్న పసితనమా

వందేళ్ళ నా వరమా 

అందాల నందనమా

నీ నవ్వులే నావెన్నెలా

నా ఊపిరే నీ ఊయలా


ఏనోము నోచినదమ్మా 

నీ ప్రేమ పొందిన జన్మా

నీ నీడగా నడిపించుమా 

నా ప్రాణమై మురిపించుమా


పరువాల పావురమా 

పైటున్న పసితనమా

నీ నవ్వులే నావెన్నెలా


నువ్వొచాకనే తొలిసారిగా

ఉగాదొచ్చి వాలింది నా వాకిటా

మనని చూడగా కనువిందుగా

మానింట్లోనె ఉంటుంది ప్రతీ పండుగా

ఏదో మాయగా ఉంది ఈ వింత సంతోషం

ఎంతో తియ్యగా ఉన్నది ఈ కొత్త సంసారం

ఏకాకి యాత్రలో ఏకైక బంధమా


నీకోసమే నేనున్నదీ

నా జీవితం నీదైనదీ


వందేళ్ళ నా వరమా 

అందాల నందనమా

నా ఊపిరే నీ ఊయలా


నిజంగా ఇదీ కలకాదుగా

కలైపోయి ఏనాడు వెళిపోదుగా

ఇలా నువ్వు నా జతచేరగా

కలే నిజమైందేమో అనిపించదా

మెడలో తాళిగా వాలెగా కోటి పుణ్యలు

వడిలో పాపగా ఉండిపో నిండు నూరేళ్ళు

మా అమ్మ పంపినా స్వర్గల దీవెనా


నీ రుపమై కనిపించెనా

నా కుంకుమై కరునించెనా


పరువాల పావురమా 

పైటున్న పసితనమా

వందేళ్ళ నా వరమా 

అందాల నందనమా

నీ నవ్వులే నావెన్నెలా 

నా ఊపిరే నీ ఊయలా


ఏనోము నోచినదమ్మా 

నీ ప్రేమ పొందిన జన్మా

నీ నీడగా నడిపించుమా

నా ప్రాణమై మురిపించుమా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)