వయసింత వేడేంటి (ఓ ప్రియతమా) సాంగ్ లిరిక్స్





Album :: N.C.Karunya- O Priyathamaa

Music:: Karunya

Singders :: Karunya 

Lyrics :: Karunya

English Lyrics Click Here 



వయసింత వేడేంటి

మనసంతా గొడవేంటి

ఈ మంటనాపేదెలాగ

ఈ విరహ సంద్రాన్ని దాటేసి ఆ ప్రేమ తీరాన్ని చేరేదెలాగ

ఒక క్షణమైనా నిదురరానీక నను ఊరించబోకే ఇలా

నిదురలోనైనా కలల వీధుల్లో నువు విహరించబోకే అలా

ఓ ప్రియతమా నా ప్రాణమా (2)


కవ్వించి మురిపించే నీ కళ్ళు 

నను గాలమేసి నీవైపు లాగాయి

తడిపెయ్యగా నన్ను చిరుజల్లు

ప్రణయ రాగాలు నాలో జ్వలించాయి

ఒక్క క్షణమైన యెదుట నువ్వుంటే నా మనసంతా హాయేనులే

మరు క్షణములోనే కరిగి మరుగైతే ఆ హాయంతమాయేనులే

ఇది భావ్యమా అనురాగమా

ఓ ప్రియతమా నా ప్రాణమా (4)

Share This :



sentiment_satisfied Emoticon