పల్లవి:
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
నోచిన వారికి నోచిన వరము
చూసినవారికి చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
చరణం 1:
స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
తన కథవింటే ఎవ్వరికైనా జన్మతరించునట
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
చరణం 2:
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
అన్నవరంలొ వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
చరణం 3:
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
చరణం 4:
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon