కస్తూరి రంగ రంగా
మాయన్న కావేటి రంగ రంగా
శ్రీ రంగ రంగ రంగా
నినుబాసి నేనెట్లు మరచుందురా
కంసునీ సంహరింప
సద్గురుడు విష్ణువే కృష్ణావతారమెత్తినప్పుడు
ఆదివారము పూటనూ, అష్టమి దినమందు జన్మించెను
తలతోటి జనన మయితే,
తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళన బుట్టెను,
ఏడుగురు దాదులను చంపెనపుడు
నెత్తురుతోటిండియు యాబాల కావు కావున ఏడ్చెను
ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు
వడలెల్ల హీనంబుతో ఈ రీతినున్నావు
కన్న తండ్రీ నిన్ను నే నెత్తుకోనీ ఏ త్రోవ పోదునే చిన్నబాలా
నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న గంగనూ ప్రార్ధించెను
జల నిధుల గంగతానుప్పొంగెను
గంగానదీలోనప్పుడు దేవకీ జలకంబులాడగానూ
నీ పుణ్యమాయె కొడక నీవొక్క నిమిషమ్ము తాళరన్న
కామధేనువునప్పుడు దేవకీమదియందు తలచగానూ
పాల వర్షమె కురిసెను,
అప్పుడు ఆ బాలపై చల్లగాను తడివస్త్రములు విడిచి,
దేవకీ పొడివస్త్రములు కట్టెను
పొత్తుళ్ళమీదనపుడు ఆ బాలుడు చక్కంగ పవళించెను
వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా
సీతా కళాస్తుడమ్మా ఈ బిడ్డ శ్రీరామ చంద్రుడమ్మా
వీపునా వింజామరా,
నా తండ్రి బొడ్డునా పారిజాతం అరికాల తామరాలు,
భుజమందు శంఖుచక్రములు కలవు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon