కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు సాంగ్ లిరిక్స్



Album: Korukunna Priyudu

Starring: Naveen Vadde, Prema

Music :Koti

Lyrics-NA

Singers :SP Balu, Chitra

Producer:D Venkata Ramana

Director:Muppalaneni Siva

Year: 1997

English Lyrics

కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు సాంగ్ లిరిక్స్ 


 కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు

అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు

మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందని

తాకే కౌగిళ్లలోన శుభకార్యం కానుందని

చందమామే అంది ఎద చంద్రమై పొంగింది

ఆ నింగి నేల ఏకం చేసే రాగంలో


కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు

అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు


ఎదురు చూసే ఆషాడమేఘం

చెలిమి గల్లే చేరే వేళా

పురులు విరిసి తనువు మెరిసే

వలపు హరివిల్లుగా

ఎదను మీటే కళ్యాణరాగం

చిలిపి గీతం పాడే వేళా

వదువు ప్రాయం నిదుర లేచే వరద గోదారిలా

ముచ్చట తీర్చగ ముందుకు వచ్చిన అనురాగమా

వెచ్చని వేడుక ముంగిట వేచిన జతచేరుమా

సోయగాల సిరులు సుస్వాగతం అంటుంటే

ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో

కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు

అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు


నిమిషమైనా నిను వీడిపోక

నిలిచిపోనా నా శశిరేఖ

పగడమంటి పెదవిపైన చలువ చిరునవ్వుగా

మనసు నేనే మారాజు వేగ

సొగసు రాజ్యం సొంతం కాదా

తనివి తీరా అణువు అణువు అందుకో కానుకా

ఆశల తోటకి ఆమని తెచ్చిన ఓ మేనకా

ప్రతి ఒక రేయి కౌగిలి పున్నమి కావాలిగా

కన్నె నాగై నన్ను నువ్వు అల్లుకుంటూ వుంటే

ఆ నింగి నేల ఏకం చేసే రాగంలో

కొంగుపట్టి లాగాడే కోరుకున్న ప్రియుడు


అందెగట్టి ఆడేనే అందగత్తె హొయలు

మోగే సన్నాయి తోన సుముహూర్తం చేరిందని

సాగే కౌగిళ్లలోన శుభకార్యం కానుందని

చందమామే అంది ఎద చంద్రమై పొంగింది

ఆ నింగి నేల ఏకం చేసే ఆనందంలో


Share This :



sentiment_satisfied Emoticon