వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్నసాంగ్ లిరిక్స్



Album: Sapthagiri Express

Starring:Saptagiri, Roshini Prakash

Music :Bulganin

Lyrics-Chaitanya Varma

Singers :Vijay Bulganin

Producer: Dr.K Ravi Kirane

Director: Arun Pawar

Year: 2016


English Script Lyrics



వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న

వదిలేసావా నన్నే ఎడబాటునా

కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని

పసివాన్నేలే ఇంకా ఎదమాటున


మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న

కరిగే మైనం నువ్వవుతున్నా నిషిలో వెలుగై నడిపావు నాన్న


వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న

వదిలేసావా నన్నే ఎడబాటునా

కసిరి వేదనలోన మసిలే ధైర్యం లేని

పసివాన్నేలే ఇంకా ఎదమాటున


నువ్వు కరుణిస్తే కను తెరిచా నువ్ నడిపిస్తే నే నడిచా

నువ్ చూపిస్తే జగమెరిగాను

నువ్వు కధ చెబితే మైమరిచా నీ ఎదపైనే నిదురించా

నీ కొడుకై తరియించాను


నువ్వే లేని నేనే లేను నువ్వు నేను వేరే కాము

నాలో నేను నువ్వే న్నాన్న


మదిలో ఎంతో దిగులే ఉన్నా

నవ్వుతూ నన్నే పెంచావు నాన్న

కరిగే మైనం నువ్వవుతున్నా

నిషిలో వెలుగై నడిపావు నాన్న

Share This :



sentiment_satisfied Emoticon