చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా సాంగ్ లిరిక్స్

 





చిత్రం: అందాల రాముడు (2006)

సంగీతం: యస్.ఏ.రాజ్ కుమార్

నటీనటులు: సునీల్, ఆర్తి అగర్వాల్

దర్శకత్వం: పి. లక్ష్మీనారాయణ

నిర్మాత: యన్. వి.ప్రసాద్, పరాస్ జైన్



చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా


తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా


ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే


రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే


ఎలా నిన్ను ఆపను వయసా... వయసా...


అణువు అణువు అందమేలె నీలీ మేఘాలకీ...


ఆశ పడిన చందమామ అందరాదే మరి...


ఈ గమ్మత్తొ చేసి ఈ అందాలె తెచ్చి నా గుండెల్లో దాచాలి...


నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూర చేరాలి...


ఏమే చిలకా ఏమంటావే నీకంటే నేబాగుంటాలెతెలుసా తెలుసా తెలుసా...


చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా


తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా


మిడిసి పడకే చిలిపి గాలి లాగినా పైటనీ...


ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికీ...


ఆ కొమ్మల్లొ పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది


నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది...


అరె తీరా చూస్తే ఏమీలేదు ఇంకా నున్ను ఊరించొద్దుమనసా మనసా మనసా ...


చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా


తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా


ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే


రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే


ఎలా నిన్ను ఆపను వయసా... వయసా...


Share This :



sentiment_satisfied Emoticon