కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా సాంగ్ లిరిక్స్ | Aarde Lyrics



Album: Lahiri Lahiri Lahirilo


Starring:Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Music :MM Keeravani
Singers :Udit Narayan, Chithra
Producer:YVS Chowdary
Director:YVS Chowdary
Year: 2002

English Script Lyrics






ఏయ్, కలవరమా..!
ఓయ్, పరవశమా..!
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతుందండి

అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి
నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ… ప్రేమ ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

చలిచలి గాలుల్లో… వెచ్చగ ఉంటోందా
ఎండను చూస్తే… చలి వేస్తోందా
ఓ ఓహొ ఓ ఓ హో… ఓ ఓహొ ఓ ఓ హో
ఎదురుగా నువ్వున్నా… విరహం పుడుతోంది
ఏ నిజమైనా… కలగా ఉంది

విసుగేదో కలిగింది… దిగులేదో పెరిగింది
అసలేదో జరిగింది… మతి కాస్తా పోయింది, ఈ ఈ ఈఈ
అదేరా ప్రేమంటే చిన్నా
ఏదేదో చేసేసి నీ కొంప ముంచే ప్రేమ
ప్రేమ, ప్రేమ… ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా

ఓ ఓహొ ఓ ఓ ఓ ఓ… ఓ ఓహొ ఓ ఓ హో
చిటపట చినుకుల్లో… పొడి పొడిగుంటోందా
చినుకే నీకు గొడుగయ్యిందా
ఓ ఓహొ ఓ ఓ ఓ ఓ… ఓ ఓహొ ఓ ఓ హో
నిద్దురలో ఉన్నా… మెలకువలా వుంది
మెలకువలోనే స్పృహ లేకుంది

చూపేమో చెదిరింది… మాటేమో వణికింది
అడుగసలే పడనంది… కుడి ఎడమై పోయింది, ఈఈ ఈ ఈ
అదేర ప్రేమంటే బచ్చా
అలాగే వేధించి నీ అంతు చూసే ప్రేమ
ప్రేమ, ప్రేమ… ప్రేమ

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
పంచదార ఎంత తిన్నా చేదుగుందండి
చింతపండే కారమయ్యి చంపుతుందండి

అదేరా ప్రేమంటే కన్నా
ఎదంతా వ్యాపించి
నీ దుంప తెంచే ప్రేమ
ప్రేమ… ప్రేమ ప్రేమ

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)