చెయ్యందించమంది ఒక పాశం సాంగ్ లిరిక్స్

 Album Bimbisara


Starring: Nandamuri Kalyan Ram, CatherIne Tresa,

Music :M M Keeravaani

Lyrics-M M Keeravaani

Singers :Mohana Bhogaraju, Sandilya Pisapati

Producer:Hari Krishna K

Director: Vassishta

Year: 2022


English Script Lyrics 


గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం
కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి.. హద్దులు దాటి..
జగములు దాటి.. యుగములు దాటి..
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం

అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా
పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా
నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు.. లేదే దిగులు..
తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం.. 
ఋణ బంధం


నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా
రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు
రాత్రి పగలు.. లేదే గుబులు
మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం
చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం

ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం
రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం


Share This :sentiment_satisfied Emoticon