Album :Inkenti Nuvve Cheppu
Starring: Prasanth, Prasanna
Music :Vikas Kurimella
Lyrics-Chinni Charan
Singers :Chinni Charan, Sri Vidya
Producer:Dr.Vijay Prasad Malla
Director:Sivasri
Year: 2017
నువ్వలా దూరంగా
నేనిల భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
ధీరుడే దీ..నంగా
మారే నీవల్లే..గా
మన్నించమంటే వినవుగా
నీ రాక నాకు చీకటింట దీపంగా
నన్ను చూడమాకు పట్ట రాని కోపంగా
నిన్ను మా అమ్మ కన్న అపురూపంగా
అనుకున్నా.నుగా..
నీ నవ్వు లేని చోటు నాకు నరకంగా
ఎన్ని పువ్వులున్న ఎడారె ఎదురుంగా
నా తప్పు నేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేవతగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.....
నువ్వలా దూ..రంగా
నేనిల భా..రంగా
ఎన్నాల్లే ఓ చెలి ఇలాగా
చిత్రం:ఇంకేంటి నువ్వేచెప్పు
సంగీతం:వికాస్ కురిమెల్ల
కెరటంలేని సంద్రం నేను
నింగేలేని తారకను.
నువ్వులేని సమయాన
నేనసలు నేనేనా
గాలి నీరూ ఆహారంతో
బతికేస్తారే ఎవరైనా..
నాకదే చాలదుగా..
నువ్వే నాకు ఊపిరిగా
బతికానే ఇన్నాళ్లు.
బహుమతిగా కన్నీళ్లు..
ఇచ్చావే ఓ చెలియా
ఇది నీకు న్యాయమా..
నిన్ను నమ్ముకుని నీతో ఒంటరిగా
నువ్వు రమ్మన్న చోటికి వచ్చాగా
నీకు అందుకే నేను అలుసయ్యాన
నను దండించావుగా
ఇది చేసిందంతా నువ్వేగా
ఈ విరహపు వ్యధ నీవల్లేగా
మళ్ళీ నాపైనే పడి నాదే
తప్పని నిందిస్తావుగా....
నువ్వలా దూ...రంగా
నేనలా భా...రంగా
ఎన్నాల్లే ఓ చెలి ఇలాగ
మన్నించేటి గుణమే లేని
మనిషివి కాదు నువ్వసలు...
దేవతల జాతి నువ్వు.
ఎందుకే ఈ తగువు.
నాలో నుండి
నిన్నే వేరు
చేసే వీలు లేదు కదే....
ప్రాణమై ఎదిగావు.
ఎలా వొదిలి పోతావు.
ఇంత కన్నా.. చెప్పలేనే
నా హృదయం విప్పలేనే..
నువ్వు తప్ప ఏమీ లేని
మాములు మనిషినే..
నీ రాక నాకు చీకటింటా దీపంగా
నన్ను చూడమాకు పట్టరాని కోపంగా
నిన్ను మా అమ్మ కన్న అపురూపంగా
అనుకున్నానుగా..
నీ నవ్వులేని చోటు నాకు నరకంగా
ఎన్ని పువ్వులున్న ఎడారి ఎదురుంగా
నా తప్పు నేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేతవగా ఆ ఆ ఆ ఆ ఆ...
నువ్వలా దూ...రంగా
నేనిల భా...రంగా
ఎన్నాల్లే ఓ చెలి ఇలాగ
ఈ గాయం సులువుగా మానదుగా
ఈ గొడవను త్వరగా మరవనుగా
అలాగని అనువంతైన నీపై ప్రేమే తరగదుగా
ఉరుముల వెనకే చినుకులుగా
నడి రాతిరి పూర్తయి వెళుతురుగా
మన యుద్ధం తీర్చి
ఇద్దరినొకటిగ ప్రేమే కలుపునుగా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon