గుమ్మాడి గుమ్మాడి సాంగ్ లిరిక్స్



గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి

డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి

చిందాలి చిందాలి తుళ్లిందంటే చిన్నారి

మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి

వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి

ముద్దైనా తినదే పరిగెత్తే పైడిలేడి

చిలకల్లే చెవులో ఎన్నో ఊసులాడి

పడుకోదే పన్నైండైనా ఏం చెయ్యాలి



ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో (2)

నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో

నా తల్లివి నువ్వు నీ తండ్రిని నేను

ఎవరినెవరు లాలిస్తున్నారో

చిత్రంగా చూస్తుంటే నీ కన్నతల్లి

పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి


వర్షంలో తడిసొచ్చి

హాయ్‌రే హాయ్ అనుకుందామా (2)

రేపుదయం జలుబొచ్చి

హాచ్చి హాచ్చి అందామా

ఓ వంక నీకు ఓ వంక నాకు

ఆవిరి పడుతూనే మీ మమ్మీ

హై పిచ్‌లో మ్యూజికల్లే తిడుతుంటుందే

మన తుమ్ములు డ్యూయెటల్లే వినపడుతుంటే

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)