ఏ సమరం మనది ఐతే పాట లిరిక్స్ | జార్జి రెడ్డి (2019)


చిత్రం : జార్జి రెడ్డి (2019)

సంగీతం : సురేష్ బొబ్బిలి  

సాహిత్యం : చైతన్య ప్రసాద్

గానం : అనురాగ్ కులకర్ణి 


ఏ సమరం మనది ఐతే

విజయం మనదె కదా

కలలే కడలి ఒడిలో

అలలై ఎగసె కదా

ఈ విడి విడి అడుగులు

ఒకటై పరుగులు పెడితే

జగమంతా మనవెంటే

జయమంటూ సాగదా


ప్రతిమది తన గది విడిచి బయటికి రాగా

ఈ హృదయం ఇక విశాలమే కాదా

మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా

సకల జగతి కోసం సై అంటు సాగదా

కలలు గన్న కాలం ముందుంది చూడరా

గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా


ఏ కూసింతా నేలలేని వాడు కూలోడయ్యెరా

సన్నకారు రైతు కూడా కన్నీరు ఆయెరా

కష్ట జీవి కడుపుకింత కూడైనా లేదురా

చెమట చుక్క విలువలేని సరుకైనాదిరా

ఆడోళ్ళపై ఆరళ్ళు ఏందిరా

నీ విద్యకే ఉద్యోగమేదిరా


మొదటి అడుగు ఇపుడే పడింది సోదరా

సకల జగతి కోసం సై అంటు సాగదా

కలలు గన్న కాలం ముందుంది చూడరా

గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా


అడవి తల్లి బిడ్డలంత అల్లాడి పోయెరా

పల్లెతల్లి తల్లడిల్లి ఘొల్లు మన్నాదిరా

నగర జీవి నడ్డి విడిగి నగుబాటే అయ్యెరా

అన్నపూర్ణ భరత మాత ఆక్రోశించెరా

ఈ దేశమే ఆదేశమిచ్చెరా

ఓ మార్పుకై సంకల్పమిచ్చెరా


అడుగు అడుగు కలిపి చిందేసి ఆడరా

సకల జగతి కోసం సై అంటు సాగరా

కలలు గన్న కాలం ముందుంది చూడరా

గెలుపు పిలుపు వింటూ చిందేసేయ్ లేరా

Share This :



sentiment_satisfied Emoticon