చిత్రం : ఘర్షణ (2004)
సంగీతం : హారిస్ జయరాజ్
సాహిత్యం : కులశేఖర్
గానం : శ్రీనివాస్
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో..
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో
మధుమాసం లోనా
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా
మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఈ పరిమళము నీదేనా
నాలో పరవశము నిజమేనా
బొండు మల్లిపువ్వు కన్నా
తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నా
లాగు మరి నీ వైపు
సొగసుని చూసి పాడగా ఎలా
కనులకు మాట రాదుగా అలా
వింతల్లొను కొత్త వింత నువ్వేన
ఆ అందం అంటే అచ్చం గాను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఆ పరుగులలో పరవళ్ళు
తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతుంది
ఆశ పడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతోంది
మోజు పడి నీకోసం
స్వరముల గీతి కోయిలా ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలో నే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
నువ్వు అచ్చుల్లోనా హల్లువో
జడకుచ్చుల్లోనా మల్లెవో
కరిమబ్బుల్లోనా విల్లువో
మధుమాసం లోనా
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా
మంచు పూల జల్లువో
మధుమాసం లోనా
మంచు పూల జల్లువో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon