వెచ్చని మట్టిలో నాటిన విత్తనం పాట లిరిక్స్ | మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

 చిత్రం : మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

సంగీతం : స్వీకార్ అగస్తి

సాహిత్యం : సాయి కిరణ

గానం : స్వీకార్ అగస్తి


వెచ్చని మట్టిలో నాటిన విత్తనం

ఊపిరందుకోదా చుక్క నీరు పట్టినా

రాతిరే కప్పిన దారులే తప్పినా

తెల్లవారనందా చీకటెంత కమ్మినా


తూరుపింట మొదలైన కిరణాల వేడి

లోకమంతా అందాలు అందించదా

దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి

రంగులద్దుకుంటూ రాదా


చిగురాకు పిలిచింది రారమ్మనీ

నీలాకాశాన మేఘాలనీ

అటు నుండి బదులేది రాలేదని

అలిగిందా ఆ ఆమని

జరిగింది గమనించి ఆ చల్లగాలి

జోలాలి పాడింది తన చెంత చేరి

చినబోయినా చిన్న ప్రాణానికీ


వేకువింట మొదలైన కిరణాల వేడి

లోకమంతా అందాలు అందించదా

దారిలోన ఎదురైనా గ్రహణాలు వీడి

రంగులద్దుకుంటూ రాదా

 

Share This :



sentiment_satisfied Emoticon