వనములను దాటి 'వెన్నెల బయలు' దాటి కవితా సాహిత్యం | కిన్నెరసాని పాటలు | విశ్వనాథ సత్యనారాయణ

కల్పన కిన్నెరసాని పాటలు


కవితా సంకలనం :: కిన్నెరసాని పాటలు

రచయిత :: విశ్వనాథ సత్యనారాయణ

కవిత పేరు ::కల్పన




 

కిన్నెర మహాపతివ్రత. అందరు తెలుగుకన్నెలకు మల్లేనే ఉద్విగ్నహృదయ. ఎక్కువ తెలుగుకుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ళ పోరాటం ఆ యింట్లోనూ వెలిసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కిన్నెరమీద నిందలారోపించడం పని అయింది. ఒకప్పుడు ఆవిడ చేసిన నింద భరించడం కష్టమైంది. కిన్నెరహృదయం శోకంచేత ప్రళయసముద్రం అయింది. కిన్నెర భర్త ఏంచేస్తాడు? తల్లిని కాదనాలేడు, భార్యను ఓదార్చుకోనూలేడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరిగి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు.




వనములను దాటి 'వెన్నెల బయలు' దాటి

తోగులను దాటి దుర్గమాద్రులను దాటి

పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు

'రాళ్ళ వాగు' దాటి పథాంతరములు దాటి

అచట కిన్నెరసాని -

  నా యాత్మయందు

  నిప్పటికి దాని సంగీతమే నదించు ...

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)