తొలి పలుకులతోనే కరిగిన మనసు పాట లిరిక్స్ | కలర్ ఫోటో (2020)

 చిత్రం : కలర్ ఫోటో (2020)

సంగీతం : కాలభైరవ 

సాహిత్యం : కిట్టు విస్సాప్రగడ 

గానం : కాలభైరవ 


తొలి పలుకులతోనే కరిగిన మనసు

చిరు చినుకుల లాగే జారే

గుసగుసలను వింటూ అలలుగ వయసు

పదపదమని తీరం చేరే


ఏ పనీపాట లేనీ ఈ చల్ల గాలి

ఓ సగం చోటే కోరి మీ కథే విందా


ఊరూ పేరూ లేని ఊహా లోకానా

తారాతీరం దాటి సాగిందా ప్రేమా 


తరగతి గది దాటి తరలిన కథకీ

తెలియని తెగువేదో చేరే

అడుగులు పడలేనీ తొలి తపనలకి

ఇరువురి మొహమాటాలే 

దూరము పో..యే.. నేడే


రాణే గీత దాటే విధే మారే

తానే తోటమాలి దరే చేరే

వెలుగూ నీడల్లే కలిసే సాయంత్రం

రంగే లేకుండా సాగే చదరంగం


సంద్రంలో నదిలా జంటవ్వాలంటూ 

రాసారో లేదో ఆ దేవుడు గారు 


తరగతి గది దాటి తరలిన కథకీ

తెలియని తెగువేదో చేరే

అడుగులు పడలేనీ తొలి తపనలకి

ఇరువురి మొహమాటాలే 

దూరము పోయే


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)