చిత్రం : శ్రీరామ రాజ్యం (2011)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : రాము, శ్రేయా ఘోషల్
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా
సీతారామ చూపేయ్ నీ మహిమ
మదిలో అసురాలిని బాపగ రా
మదమత్సర క్రోధములే మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా..రా..
శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా
ఆఆ..దరిశనమును కోర దరికే చేరే
దయగల మా రాజు దాశరధీ
తొలుతనే ఎదురేగి కుశలములడిగీ
హితమును గావించే ప్రియ వాదీ
ధీరమతియై న్యాయపతియై ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహకరమై మేలు వొసగునులే
అందరు ఒకటేలే రామునికి ఆదరమొకటేలే
సకల గుణ ధాముని రీతిని
రాముని నీతిని ఏమని పొగడుదులే
మా శ్రీ రామా లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా
సీతారామ చూపేయ్ నీ మహిమా
తాంబూల రాగాల ప్రేమామృతం
తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం
ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడా మధురం..
సమయం అంతా సఫలం..
ఇది రామ ప్రేమలోకం..
ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం
రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం ..ఆఅ
శ్రీ రామ రామ రఘురామా
పిలిచే సమ్మోహన సుస్వరామా
సీతాభామా ప్రేమారాధనమా
హరికే హరి చందన బంధనమా
శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon