సూ సూడు హీరోలు పాట లిరిక్స్ | జాతిరత్నాలు (2021)

 చిత్రం : జాతిరత్నాలు (2021)

సంగీతం : రాథన్  

సాహిత్యం : కాసర్ల శ్యామ్ 

గానం : రాహుల్ సిప్లిగంజ్


సూ సూడు హీరోలు

ఒట్టి బుడ్డర ఖానులు 

వాల్యూ లేని వజ్రాలు

మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూర్లూ 

లేరే ఇట్లాంటోళ్ళు

వీళ్ళైనా పుట్టాలంటే 

ఇంకో వందేళ్ళు


శాటిలైటుకైనా చిక్కరు 

వీళ్లో గల్లీ రాకెట్లు

డైలీ బిల్లు గేట్స్ కి మొక్కే 

వీళ్ళై చిల్లుల పాకెట్లు

సుద్దాపూసలు సొంటే మాటలు 

తిండికి తిమ్మ రాజులు

పంటే లేవరు లేస్తే ఆగరు 

పనికి పోతరాజులు


సూ సూడు హీరోలు

ఒట్టి బుడ్డర ఖానులు

వాల్యూ లేని వజ్రాలు

మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూర్లూ 

లేరే ఇట్లాంటోళ్ళు

వీళ్ళైనా పుట్టాలంటే 

ఇంకో వందేళ్ళు


జానే జిగర్... 


వీళ్ళతోటి పోల్చామంటే 

ధర్నా చేస్తై కోతులు

వీళ్ళుగాని జపం చేస్తే 

దూకి చస్తయ్ కొంగలు

ఊరిమీద పడ్డారంటే 

ఉరేసుకుంటై వాచీలు

వీళ్ళ కండ్లు పడ్డయంటే 

మిగిలేదింకా గోచీలు

పాకిస్థానుకైనా పోతరు 

ఫ్రీ వైఫై చూపిస్తే

బంగ్లాదేశ్ కైనా వస్తరు 

బాటిల్ నే ఇప్పిస్తే


జింగిలి రంగా బొంగరం 

సింగిల్ తాడు బొంగరం

వీళ్ళని గెలికినోని 

బతుకు చూస్తే భయంకరం


దిన్ కి బాతోంసె కామ్ ఖరాబ్

రాత్ కి బాతోంసె నీంద్ ఖరాబ్

వీళ్ళని బాగుజేద్దాం అన్నోడ్దేమో 

దిమాఖ్ ఖారాబ్


సూ సూడు హీరోలు

ఒట్టి బుడ్డర ఖానులు

వాల్యూ లేని వజ్రాలు

మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూళ్ళు 

లేరే ఇట్లాంటోళ్ళు

వీళ్ళైనా పుట్టాలంటే 

ఇంకో వందేళ్ళు


వీళ్ళు రాసిన సప్లిమెంట్లతో 

అచ్చెయ్యొచ్చు పుస్తకం

వీళ్ళ కథలు జెప్పుకొని 

గడిపేయొచ్చు ఓ శకం

గిల్లి మరీ లొల్లి పెట్టే 

సంటి పిల్లలు అచ్చము

పిల్లి వీళ్ళ జోలికి రాదు 

ఎయ్యరు గనక బిచ్చము

ఇజ్జత్కి సవాలంటే 

ఇంటి గడప తొక్కరు

బుద్ధి గడ్డి తిన్నారంటే 

దొడ్డి దారి ఇడవరు


భోళా..! హరిలోరంగ ఆ మొఖం 

పంగనామాల వాలకం

మూడే పాత్రలతో రోజు వీధి నాటకం

శంభో లింగ ఈ త్రికం గప్పాలు అర్రాచకం

బాబో..! ఎవ్వనికి మూడుతుందో 

ఎట్టా ఉందో జాతకం


సూ సూడు హీరోలు

ఒట్టి బుడ్డర ఖానులు

వాల్యూ లేని వజ్రాలు

మన జాతి రత్నాలు

ఈ సుట్టు పదూళ్ళు 

లేరే ఇట్లాంటోళ్ళు

వీళ్ళైనా పుట్టాలంటే 

ఇంకో వందేళ్ళు

 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)