చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖలు (1984)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, శైలజ
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
రామ రాజ రాజేశ్వరా...
రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ
అఘమేఘమా రుత శ్రీకర
అఘమేఘమా రుత శ్రీకర
అసురేంద్ర మృగేంద్ర వర జనకా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
ఆచారమా సంప్రదాయమా
ఆచారమా సంప్రదాయమా
ఆడపిల్లలకే అపచారమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలకగా
కట్నమన్నదే కంఠపాశమై
కలకంఠి కంట నీరొలుకగా
సంసారమంటే సంత బేరమా
సంసారమంటే సంత బేరమా
తగునా జనకా సమ్మతమా
ఇది నీ మతమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మనసులేని ఈ మనువులెందుకు
మమతలేని మాంగళ్యమెందుకు
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
మెడలు వంచి చేసే మేళాల పెళ్ళి
ఇహమా పరమా అది నీ తరమా
ఇహమా పరమా అది నీ తరమా
పరహింస పారాయణ చంద్రశ్రీ
పరంధామ మాతృ ప్రాణేశ్వరా
పరహింస పారాయణ చంద్రశ్రీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon