చిత్రం : జైసింహ (2018)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రేవంత్, రమ్యా బెహరా
ప్రియం జగమే ఆనందమయం
హృదయం నిన్ను దాచే ప్రేమాలయం
పుట్టగానే ప్రేమపై నే ఒట్టేసుకున్నా
నేను నీ వాడ్ననీ
నిన్ను నన్ను జంట కలిపి చదువుకున్న
మనమన్న ఓ మాటనీ
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా
నువ్వలా పువ్వులా నవ్వుతూ ఉండడం
ఎప్పుడూ నాకిష్టమే చెలీ
నువ్విలా ప్రాణమై గుండెలో నిండడం
జన్మకో అదృష్టమే మరీ
చెలియా జీవితమే నీవలనే అద్భుతమే
ఏరేపూ ఏమాపూ కాపాడే నీ చూపు
నన్నంటీ ఉంటే అంతే చాలులే
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా
అనడం వినడం అస్సలే లేవులే
మౌనమైన ప్రేమ భాషలో
ఇవ్వడం పొందడం లెక్కకే రావులే
ఒక్కరేగా ఉంది ప్రేమలో
బ్రతుకే నీ కొరకూ అందుకో కాదనకు
కొంగొత్త రంగేదో నీవల్లే దొరికింది
నా జిందగీలో సంతోషాలకూ
నీతో నేనుంటా నీలో నేనుంటా
నింగీ నేలా గాలీ ఉన్నదాకా
నీతో నేనుంటా నీలో నేనుంటా
ఎన్ని జన్మలైనా వీడిపోకా
మనసుకు నువ్వు తప్పా
మరే ప్రపంచం తెలియదేనాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కలలకీ
మనసుకు నువ్వు తప్పా
మరే ప్రపంచం తెలియదేనాటికీ
చెరగని కాటుకల్లే దిద్దుకుంటా
నిన్ను నా కలలకీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon