ప్రాణంలో ప్రాణంగా పాట లిరిక్స్ | ఆంధ్రుడు (2005)

 చిత్రం : ఆంధ్రుడు (2005) 

సంగీతం : కళ్యాణ్ కోడూరి   

సాహిత్యం : చంద్రబోస్ 

గానం : చిత్ర 


ప్రాణంలో ప్రాణంగా 

మాటల్లో మౌనంగా చెబుతున్నా

బాధైన ఏదైనా 

భారంగా దూరంగా వెళుతున్నా

మొన్న కన్నకల నిన్న విన్నకథ

రేపు రాదు కదా జతా

ఇలా ఎలా నిరాశగా 

దరి దాటుతున్నా 

ఊరు మారుతున్నా

ఊరుకోదు ఎలా


ప్రాణంలో ప్రాణంగా 

మాటల్లో మౌనంగా చెబుతున్నా

బాధైన ఏదైనా 

భారంగా దూరంగా వెళుతున్నా

మొన్న కన్నకల నిన్న విన్నకథ

రేపు రాదు కదా జతా

ఇలా ఎలా నిరాశగా 

దరి దాటుతున్నా 

ఊరు మారుతున్నా

ఊరుకోదు ఎలా


ప్రాణంలో ప్రాణంగా 

మాటల్లో మౌనంగా చెబుతున్నా


స్నేహం నాదే ప్రేమ నాదే 

ఆ పైన ద్రోహం నాదే

కన్ను నాదే వేలు నాదే 

కన్నీరు నాదేలే

తప్పంతా నాదే శిక్షంతా నాకే 

తప్పించుకోలేనే

ఎడారిలో తుఫానునై 

తడి ఆరుతున్నా 

తుది చూడకున్నా

ఎదురీదుతున్నా


ప్రాణంలో ప్రాణంగా 

మాటల్లో మౌనంగా చెబుతున్నా

బాధైన ఏదైనా 

భారంగా దూరంగా వెళుతున్నా


ఆట నాదే గెలుపు నాదే 

అనుకోని ఓటమి నాదే

మాట నాదే బదులూ నాదే 

ప్రశ్నల్లే మిగిలానే

నా జాతకాన్నే నా చేతితోనే 

ఏమార్చి రాశానే

గతానిపై సమాధినై 

గతి మారుతున్నా 

స్ధితి మారుతున్నా 

బ్రతికేస్తు ఉన్నా...


ప్రాణంలో ప్రాణంగా 

మాటల్లో మౌనంగా చెబుతున్నా


గతానిపై సమాధినై 

గతి మారుతున్నా 

స్ధితి మారుతున్నా 

బ్రతికేస్తు ఉన్నా

 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)