చిత్రం : మల్లెలతీరం (2013)
సాహిత్యం : ఉమామహేశ్వరరావు
సంగీతం : పవన్ కుమార్
గానం : లిప్సిక
పిల్లగాలుల పల్లకీలో
మల్లె మధువై నీలొ చేరి
నిన్ను చూస్తూ నన్ను నేనే
వెదుకుకుంటున్నా
మరచి విశ్వము మరచి నేనే
మరచి సర్వము నన్ను నేనే
మౌనమే మకరందమౌతూ
మురిసిపోతున్నా
కన్న కలలే వెన్నెలవుతూ
కన్నులెదుటే విరగబూసె
ఎన్ని జన్మల పుణ్య ఫలమో
నిన్ను కలిసితిని
అలుకలన్ని ఆవిరయ్యె
వేదనంతా వేడుకయ్యె
చీకటంతా వెలుతురయ్యె
చెలిమి తోడయ్యే
ఆకశములో చందమామ
కొలను పూసిన కలువ భామ
నేల నడిచెను కలసి మెలసి
కొత్త దారులలో
పలుకు తేనెల గోరు వంకతొ
పంజరములో రామచిలుకను
కలిపి నడిపిన బ్రహ్మ రాతను
మార్చు వారెవరో
గోరు వెచ్చని నింగి మనసు
ఆకు పచ్చని నేల సొగసు
కలసి కమ్మని తోడు నీడై
అడుగులేసేనా
నేల రాలిన చినుకు వానగు
వాన నీరె పారు ఏరగు
పారు యేరులె పొంగి పొరలుతు
సంద్రమయ్యెనుగా
అంత సంద్రమె ఆవిరౌతు
మబ్బు లోపలె చేరే నీరై
అట్టి నీరె చిట్టి చినుకై
మట్టి తాకెనుగా
మనసులొకటై మమతలొకటై
ఆశలొకటై బాసలొకటై
పరిమళించిన జంట మల్లెలు
జతను వీడేనా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon