చిత్రం : నువ్వువస్తావని (2000)
సంగీతం : ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి...
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తన రూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రుపం చూపాలి
రెప్పల వెనుక ప్రతి స్వప్నం కళలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిమిషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
నీ తోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వు చేరుకోనిదే
గుండెకు సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపురేఖలేవో ఎవరినడగాలి
పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon