చిత్రం : మెంటల్ మదిలో (2017)
సంగీతం : ప్రశాంత్ ఆర్. విహారి
సాహిత్యం : వివేక్ ఆత్రేయ
గానం : శక్తిశ్రీ గోపాలన్
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
ఊఊఊహూ..ఊఊఊహూ..
ఊహలే ఆగవే
వెంట నీవుంటే పాటలా
నీ జతే వీడితే
ఒంటరయ్యేనూ ఆ కలా
అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై
ఓఓఓ అలై చేరవా ప్రియా
తీరానికే స్వరం నీవై
దరే తాకుతూ అలా
దాటేయకు మరో నీడై
ప్రతిపదం పాదమై
ఓ గానమై నీ చెంత చేరదా
పదే పదే ఊసులై
ఊరించెనే ఎడారి వానలా
ఊఊఊఊ... ఊఊఊఊ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon