ఓ చెలీ నీ చూపులో నేను ఉదయించా పాట లిరిక్స్ | ధూమ్-3 (2013)

 చిత్రం : ధూమ్-3 (2013)

సంగీతం : ప్రీతమ్ చక్రబొర్తి   

సాహిత్యం : భాస్కరభట్ల  

గానం : మోహిత్ చౌహాన్


ఓ చెలీ నీ చూపులో నేను ఉదయించా

ఓ చెలీ చిరునవ్వులో నన్ను వెలిగించా


ఓ చెలీ నీ చూపులో నేను ఉదయించా

ఓ చెలీ చిరునవ్వులో నన్ను వెలిగించా

నువ్వు వెళ్ళే దారిలో మనసు పారేశా

నావలా నీ ప్రేమలో మునిగిపోతున్నా


ఊహించలే ఊహించలే ఓ నిజం

ఊహించలే ఊహించలే


రావే చూడే ఇలాగే కునుకే చెడిందే కనులకే

అమ్మో చెపితే వినాలె కుదురే చెడిందే వయసుకే

బ్రహ్మ వేసిన బాణమై దూసుకొచ్చేశావ్

తీయగా నా ఊపిరే తీసుకెళ్తున్నావ్

కన్నె సొగసు కత్తికే నన్ను గుచ్చేశావ్

ప్రాణమే ఇస్తానులే అంత నచ్చేశావ్..


ఊహించలే ఊహించలే ఓ నిజం

ఊహించలే ఊహించలే


ఆశపోదులే నీధ్యాసలో చేరి

చంపినా సరే నవ్వేస్తూ ఉంటానే

ప్రేమలా ఇలా నీ శ్వాస తాకితే

జీవితానికే అది చాలు అంటదే

రకరకాల కలకలం తలపులో రేపావ్

అందమే తావీజులా మహిమ చూపించావ్


నువ్వు వెళ్ళే దారిలో మనసు పారేశా

నావలా నీ ప్రేమలో మునిగిపోతున్నా


ఊహించలే ఊహించలే ఓ నిజం

ఊహించలే ఊహించలే

ఊహించలే ఊహించలే ఓ నిజం

ఊహించలే ఊహించలే 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)