చిత్రం : హోప్ (2018)
సంగీతం : యదు కృష్ణ
సాహిత్యం : సంతోష్ శర్మ
గానం : సనూప్ కుమార్
ఒక పాటై హాయిగ సాగేటి బంధం ప్రణయం
చెలి నాకై వెన్నెలగా కరిగేటి బంధం ప్రణయం
ఇది ఎదలోన వానై విరితేనెలిచ్చెను
శతకోటి జన్మలకూ నిలిచేను ఈ తోడు
పదిలం ఈ ప్రేమ గంథం
మన మనసే మధురాతి మధురం
పన్నీటి జల్లంది స్నేహం
నీ జతలో పలికే మనసే
పాడేనూ ఈ గానం
ఒక పాటై హాయిగ సాగేటి బంధం ప్రణయం
చెలి నాకై వెన్నెలగా కరిగేటి బంధం ప్రణయం
ఇది ఎదలోన వానై విరితేనెలిచ్చెను
శతకోటి జన్మలకూ నిలిచేను ఈ తోడు
పదిలం ఈ ప్రేమ గంథం
మన మనసే మధురాతి మధురం
పన్నీటి జల్లంది స్నేహం
నీ జతలో పలికే మనసే
పాడేనూ ఈ గానం
వేల తారల్ని మురిపించు జాబిల్లి కోసం
అమవాసనోడించు విరహం
విరిసే పూలా సుగంధాల రాగాల కోసం
విరహాన్ని ఓడించు ప్రణయం
నీ మౌనం నిట్టూర్పై చూసెనుగా
నీ భావం నా గుండెను చేరెనుగా
కలనైనా నిన్నే చూపేటి కళ్ళే
నీ ప్రేమ కోరీ రచించేను ప్రణయం
ఏడు వర్ణాల కలపోత సంకల్ప స్వప్నం
మనకోసమందించు ప్రణయం
ఎదలో మన ప్రేమ భావం అనంతం అపూర్వం
కొలిచేను కొలువైన ప్రణయం
ఎన్నటికి నీ తోడు నేనొకరిని
నీవంటే నాలోని జీవనమే
పెనవేసే బంధం ఈ కొత్త జన్మం
జీవన నాదానా ధ్వనించేను హృదయం
ఈ కాలం..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon