చిత్రం : డర్టీ పిక్చర్ (2011)
సంగీతం : విశాల్ శేఖర్
సాహిత్యం :
గానం :
ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ
సెలయేటి నాదమే ప్రేమంటే
హరివిల్లు అందమే ప్రేమంటే
విడిపోని బంధమే ప్రేమంటే
నయనాన వెలుగే అదీ
ప్రియ నువ్వే జీవన జ్యోతివిలే
నా మదిలో పదిలము అయ్యావే
మురిపించవే మరిపించవే పలికేనే రాగ వీణా
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
ఒక దివ్య గానమే ప్రేమంటే
ఎదలోని రాగమే ప్రేమంటే
మకరంద సారమే ప్రేమంటే
సుమ గంధమేలే అదీ
ఉదయమైన నీ ఊహలే సంజె వేళ నీ ఊహలే
ఓఓ నువ్వే చెలి నా గమ్యమే రేపవలు నీ ధ్యాసలే
నీవులేని వెన్నెల రేయి చీకటులు కమ్మేస్తాయి
రావేల రంగుల చిలక నా ప్రేమ మొలక
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
జంటగానూ నడిచీ నడిచీ సొమ్మసిల్లి పోయానే
అదేబాటలోనే చేరవే మాటామంతి తోనే
నేటి రేయి సాగనున్నదే ఇదే రాతిరీ చేరవే
ఇక మనదే ఈ జగమే నీవెక్కడో నేనక్కడే
మన పెదవులే తడబడెనులే ఇక దూరమెందుకంటా
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
నీకోసమే ప్రేమ దాచి ఉంచినానే
ప్రేమ దాచి ఉంచినానే ప్రేమ దాచి ఉంచినానే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon