నిన్నే మది కొలుచుకున్నదాననమ్మా పాట లిరిక్స్ | శ్రీ రాజ రాజేశ్వరి (2001)

 చిత్రం : శ్రీ రాజ రాజేశ్వరి (2001)

సంగీతం : దేవ

సాహిత్యం :

గానం : చిత్ర


నిన్నే మది కొలుచుకున్నదాననమ్మా

కన్ను తెరిచి నా బాధ చూడవమ్మా

మొదలును తుదవు మాకు నువ్వే కదమ్మా

ఒక ముక్కోణ ప్రశ్న ఇది తీర్చమంటు వేడెదనమ్మా


చింతలు తీర్చే కులదైవం నీవే మా తల్లీ

మగువల మంగళ కారిణిగా వెలసిన మాంకాళి

అగ్నిని చేకొని వచ్చితిని

అంగ ప్రదక్షిణ చేసితిని

నిత్యము పూజలు చేసితిని

నీ పాదాలను మొక్కితిని

ఆపద బాపి కాపాడంగా

పతి అశువులనే భిక్షడిగితినే

ఇకను మౌనం ఏలమ్మా


నాదు మదినీ కొలువుండూ తల్లీ నా తల్లీ

మదిలో మంటగ రగిలేటీ వేదన పోవాలి

అగ్నిని చేకొని వచ్చితిని

అంగ ప్రదక్షిణ చేసితిని

నిత్యము పూజలు చేసితిని

నీ పాదాలను మొక్కితిని

ఆపద బాపి కాపాడంగా

పతి అశువులనే భిక్షడిగితినే

ఇకను మౌనం ఏలమ్మా


ఆధారమే లేని ఈ దీనురాలిపై

దయచూపు దిక్కింక నీవేనమ్మా

ఆకాశమేలేక మరి దారిఇకలేదమ్మా

అఖిలాండ ఈశ్వరీ వరమీయమ్మా

దిక్కులే కూలినా చుక్కలే రాలినా

మగువ కోరేదొక్క మాంగల్యమే

ఈ గతిని నా పతిని ఇంకొకతి దోచితే

నా కలలు కల్లలై పోయేనమ్మా

సూదిమొననైనా ఒక కాలు నిలిపి

తపసునే చేసే నాగేశ్వరీ


ఒకనింగి ఒక భూమి ఎన్నడూ

ఎవరేమి అన్ననూ విడిపోవమ్మా

ఒక ప్రాణమొక దేహం అది కాద అనుబంధం

తనులేక మనలేనమ్మా

కోరి పతినంటా నిన్నే శరణంటా

అభయ హస్తాన్నే దయచేయుము


ఒక మారు చచ్చి మరల బ్రతికొచ్చా

అది కూడ నా ప్రేమకవమానమా

బెజవాడ దుర్గమ్మా పతిభిక్షనీవమ్మా

కన్యకా పరమేశ్వరీ దాంపత్యమీవామరి

శివుని భర్తగా పొందుటకు నువు

ఘోర తపసునే చేసినా కథలు నే విన్నానమ్మా


చింతలు తీర్చే కులదైవం నీవే మా తల్లీ

మగువల మంగళ కారిణిగా వెలసిన మాంకాళి

అగ్నిని చేకొని వచ్చితిని

అంగ ప్రదక్షిణ చేసితిని

నిత్యము పూజలు చేసితిని

నీ పాదాలను మొక్కితిని

ఆపద బాపి కాపాడంగా

పతి అశువులనే భిక్షడిగితినే

ఇకను మౌనం ఏలమ్మా


ఒక నాటి అనుభంధం ఈ నాటి రుణబంధం

జతలేక వెతనొందు వలపేదమ్మా

చెలరేగు పరువాన కోరికలు రగిలించి

ఈనాడు నా పతిని వెలివేతువా

శంకరుని మేనిలో సగపాలు నాదంచు

కులుకుతూ తిరిగావు ఇది న్యాయమా

జన్మ జన్మాలుగా జతకూడి బతికినా

నా పతిని కోరడం అన్యాయమా


తాళివరమేగా నిన్ను కోరిందీ

పూజలే చేసి పతిని అడిగింది

పూజకె నోచనీ పువ్వునై వాడితిని

అది నాదు విధియందువా

మతిమాలి వగనాలుఒకచాల నిలిచున్న

ఆలికిక బ్రతుకేదమ్మా  

నాలోని వలపు గుండెల్ల పిలుపు

కోరేది నా వాడి తోడేనమ్మా

ఏనాడు గాని నువ్వంటె బ్రతికే

నువ్వు గాక నాకింక తల్లేదమ్మా

వలపింక ఫలియించునా

వలపుగా జ్వలించునా

మాంగళ్యమీ భిక్షయే

ఎందుకిచ్చావు ఈ శిక్షయే

ఒక సతికి ఒక పతికి

వరమనుట నిజమైతే

నా పతిని నాకివ్వు

లేక నను బలితీసుకో  

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)