నేర్చేవు సరసాలు చాలా పాట లిరిక్స్ | సతీసక్కుబాయి (1965)

 చిత్రం : సతీసక్కుబాయి (1965)

సంగీతం : పి.ఆదినారాయణరావు 

సాహిత్యం : సముద్రాల రాఘవాచార్య

గానం : జానకి, జిక్కీ, బృందం


ఓ.. ఓఓ.. నేర్చేవు సరసాలు చాలా 

మేలా నీకీ లీల !

ఆ మూల గాచీ, చేలాలు దోచీ

చెలగాటమాడేవుగా..

చెలగాటమాడేవుగా..


నేరాలు మాని తీరాన చేరి

చేసాచి యాచించరే ..

చేసాచి యాచించరే ..


చిలిపి కృష్ణయ్యా ! వేధించకయ్యా !

చేయి జాప సిగ్గౌనయా

చేయి జాప సిగ్గౌనయా


దేహాభిమానాలు ఏలా

పరమాత్మనౌ నాదు మ్రోల


వెలిగించినావు విజ్ఞాన జ్యోతి

తరియించె మా జన్మలే

తరియించె మా జన్మలే


ఆఆఆఆఆ...ఆఆఆఆఅ....


యుక్తం కిం తవ శర్వరీశ ముఖ

మద్వేణీ సమాకర్షణం

వీధ్యాం త్వత్ కుచ మండలం

మమకథం గృహ్ణాతి చేతోజవాత్

వ్యత్యస్తం క్రియతే త్వయా జహి జహి

స్వామిన్ వచః సాధుతే

ఆగోయత్కురుతే తదేవ భవతాం

దండస్య యోగ్యం ఖలుః


ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా

కన్నుల వెలుగూ నీవయ్యా

సరసకు చేరవయ్యా

సరసకు చేరవయ్యా


ఓ వన్నెల చిన్నెల చిన్నారీ

వలపులు చిలికే వయ్యారీ

సరసత నీదే సుమా

సరసత నీదే సుమా


నీ మురళీ ఆలాపన నేనే,

నీ మంజీర ఝుణం ఝుణ నేనే

నీ మురళీ ఆలాపన నేనే,

నీ మంజీర ఝుణం ఝుణ నేనే

నేనె సుమా నీ రాసలీల

నేనె సుమా నీ రాసలీల


ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా

కన్నుల వెలుగూ నీవయ్యా

సరసకు చేరవయ్యా

సరసకు చేరవయ్యా


పతి సుతులా నేనేనని ఎంచి

సతతము నన్నే మనోగతినుంచి

రాధసఖే ఈ రాసలీలా

రాధసఖే ఈ రాసలీలా


ఓ వన్నెల చిన్నెల కృష్ణయ్యా

కన్నుల వెలుగూ నీవయ్యా

సరసకు చేరవయ్యా

సరసకు చేరవయ్యా 

 


Share This :



sentiment_satisfied Emoticon