ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం
నీళ కుచగిరి తటమున
నిద్రవోవు కృష్ణు మేల్కొల్పి
శృతి శతాకృష్టమైన
తనదు పారార్ద్యమెరిగించి
తాను తలను దాల్చి
విడచిన పూదండ త్రాట గట్టి
వశునిగా గొన్న
గోదకు వందనములు
గోదకు వందనములు
హంసలు తిరుగు వరిమళ్ళల
అందమైన విల్లిపుత్తూరు గోదమ్మ
విష్ణు గూర్చి పాడినట్టి
తిరుప్పావు పాశురముల్
తలచినంతనే పాపముల్ తొలగి చనును
తలచినంతనే పాపముల్ తొలగి చనును
తలను దాల్చిన పూదండ తగనిదనక
శ్రీషుకర్పించుచు తనను శ్రీనివాస దేవు
జేర్చుమయని కామదేవు వేడు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు
గోద మాటలే మాకును కోర్కెలిచ్చు
మార్గశీర్షంబు కడు
మంచి మాసమిదియె
మంచి వెన్నెల రాత్రులు
మంచి నగలు కలిగి
సుందరులౌ గోప కన్నెలారా
వేకువనే లేచి మీరాడవెక్కయున్న
రండు నోమును నోచగ రమ్యంబుగా
కలువకంటి యశోద
సింగంపు కొదమనంద
తనయుండు చంద్రార్క నయనధారి
ఆది నారాయణుండె మీ ఆర్తి దీర్చు
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును.
మేలు మేలని లోకముల్ మెచ్చుకొనును.
భువిని జన్మించి
సుఖియించు పుణ్యులారా
వినుడు మా నోము
నియమముల్ వివరమ్ముగా
క్షీర సాగర శయనుని కీర్తి పాడి
వేకువనే లేచి మీరాడి వేక్కమీరా
శుచులమై యుండి
కాటుకల్ సుమములిడక
పాలు నేయి భుజింపక
పరమ భక్తి పెద్ద పిన్నల
గుర్తించి ప్రీతి గూర్చి
పలుకరానట్టి పలుకులను పలుక కుండా
చేయరానట్టి పనులను చేయకుండా
మేము నోచెదమందరి మేలు కోరీ
మేము నోచెదమందరి మేలు కోరీ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon