చిత్రం : కణం (2018)
సంగీతం : శామ్ సి.ఎస్.
సాహిత్యం : కృష్ణ మదినేని
గానం : స్వాగత ఎస్.కృష్ణన్
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
ఏ బంధమో మీకున్నదీ
నీ నీడల్లే నిన్నే చేరెనిలా
జో లాలిజో జో లాలిజో
నీ లాలిపాటను మరచావేలా
తానెవ్వరో నువ్వెవ్వరో
అమ్మా అంటు ఆ గుండె పిలిచెలే
నువ్వు చూసిన ప్రాణమే నీతో నడిచే
కొంగు పట్టి వెంట కదిలె నీతో నీడలా
గాయం కనిపించని నీ గేయం ఇదిలే
ప్రాణమవని ప్రాణమేదో ప్రాణమే కోరెన్
వెన్నెలో పుట్టే నీజాబిలమ్మా
నీ కంటి వెలుగై తానున్నదే
నీకేమి కానీ నీ భాగమేదో
నిను వీడిపోకా తోడున్నదీ
కాలం మళ్ళీ ఎదురవ్వదూ
దింపేసిన భారమే శ్వాసై కలిసే
నువ్వు కనని జననమేదో నిన్నే చేరెనే
నువ్వే కనిపెంచనీ నీ రూపం తనదో
అమ్మ ఐనా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో
పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే
నీ కురులే నిమిరే ఓ అమ్మలా
నీ కంటి వెనుక కలలేవొ తెలిసి
నీ ముందు నిలిపే పసిపాపలా
పాశం నిన్ను ప్రేమించెనే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon