నీ కనులలో కొలిమై రగిలే కలేదో పాట లిరిక్స్ | యాత్ర (2018)

 చిత్రం : యాత్ర (2018)

సంగీతం : కె.కృష్ణ కుమార్ 

సాహిత్యం : సిరివెన్నెల

గానం : కాలభైరవ


నీ కనులలో కొలిమై

రగిలే కలేదో

నిజమై తెలవారనీ

వెతికే వెలుగై రానీ


ఈ నాటి ఈ సుప్రభాత గీతం

నీకిదే అన్నదీ స్వాగతం

ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం

చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం


ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది

అంతరంగమే కదనరంగమైనదీ

ప్రాణమే బాణమల్లె తరుముతున్నది

నిన్ను నీవే జయించిరార

రాజశేఖరా అంటున్నదీ


మనసులో మండుటెంటలాగా

నిప్పులే చెరగనీ నిశ్చయం

నీ గుండెలో మంచుకొండలాగా

నిత్యమూ నిలవనీ నమ్మకం


వసుధకే వందనం చెయ్యకుండా

నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా

ఆశయం నెత్తురై పొంగకుండా

శ్వాసలోని సమర శంఖమాగుతుందా


ఈ నాటి ఈ సుప్రభాత గీతం

నీకిదే అన్నదీ స్వాగతం

ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం

చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం


ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది

అంతరంగమే కదనరంగమైనదీ

ప్రాణమే బాణమల్లె తరుముతున్నది

నిన్ను నీవే జయించిరార

రాజశేఖరా అంటున్నదీ


మనసులో మండుటెంటలాగా

నిప్పులే చెరగనీ నిశ్చయం

నీ గుండెలో మంచుకొండలాగా

నిత్యమూ నిలవనీ నమ్మకం


వసుధకే వందనం చెయ్యకుండా

నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా

ఆశయం నెత్తురై పొంగకుండా

శ్వాసలోని సమర శంఖమాగుతుందా 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)