నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు పాట లిరిక్స్ | అల వైకుంఠపురములో (2019)

 చిత్రం : అల వైకుంఠపురములో (2019)

సంగీతం : ఎస్.ఎస్.థమన్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : సిధ్ శ్రీరామ్


నీ కాళ్ళని పట్టుకు

వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చుపులనల్లా తొక్కుకు

వెళ్లకు దయలేదా అసలు


నీ కాళ్ళని పట్టుకు

వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చుపులనల్లా తొక్కుకు

వెళ్లకు దయలేదా అసలు


నీ కళ్ళకి కావలి కాస్తాయే

కాటుకలా నా కలలు

నువ్వు నులుముతుంటే

ఎర్రగ కంది చిందేనే సెగలు


నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు

ఉంటే ముంగురులు

నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే

నిష్టూరపు విలవిలలూ


సామజవరగమన

నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న

అదుపు చెప్పతగునా


సామజవరగమన

నిను చూసి ఆగగలనా

మనసు మీద వయసుకున్న

అదుపు చెప్పతగునా


నీ కాళ్ళని పట్టుకు

వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చుపులనల్లా తొక్కుకు

వెళ్లకు దయలేదా అసలు

మల్లెల మాసమా

మంజుల హాసమా

ప్రతి మలుపులోన

ఎదురు పడిన

వన్నెల వనమా


విరిసిన పింఛమా

విరుల ప్రపంచమా

ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె

ఎన్నగ వశమా


అరె నా గాలే తగిలినా

నా నీడే తరిమినా

ఉలకవా పలకవా భామా


ఎంతో బ్రతిమాలినా

ఇంతేనా అంగనా

మదిని మీటు మధురమైన

మనవిని వినుమా


సామజవరగమన

నిను చూసి ఆగ గలనా

మనసు మీద వయసుకున్న

అదుపు చెప్పతగునా


సామజవరగమన

నిను చూసి ఆగ గలనా

మనసు మీద వయసుకున్న

అదుపు చెప్ప తగునా


నీ కాళ్ళని పట్టుకు

వదలనన్నవి చూడే నా కళ్ళు

ఆ చుపులనల్లా తొక్కుకు

వెళ్లకు దయలేదా అసలు


నీ కళ్ళకి కావలి కాస్తాయే

కాటుకల నా కలలు

నువ్వు నులుముతుంటే

ఎర్రగ కంది చిందేనే సెగలూ

  


Share This :



sentiment_satisfied Emoticon