చిత్రం : చూసీ చూడంగానే (2020)
సంగీతం : గోపీ సుందర్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : గోపీ సుందర్
నేడే నాకు నేను
పరిచయమౌతున్నా
నీలో నన్ను చూసి
పరవశమౌతున్నా
సెకనుకు పదిసార్లు
నీ పేరంటున్నా
నేనోసారైనా
నాకు గుర్తు రాకున్నా
కవినేమ్ కాకున్నా
కవితలు రాస్తున్నా
తెలియని రంగుల్లో
నీతో కలలుకంటున్నా
ఇన్ని నాళ్ళుగా
నిన్ను చూపని
నిన్న మొన్నపై
కోపమున్నదే
నిన్ను చూడక
నిన్ను కలవక
తెల్లవారదే రోజు గడవదే
ప్రేమనూ మరోటనూ
నువ్వు నా నిజం
నిండుగా నువ్వై
మారనీ జగం
నా నిను విడిచి
నిమిషం కదలదుగా
ఎదుట నిలిచిన
కలిసి గడిపిన
ఎంతకీ చెలి తనివి తీరదే
తలపు తలపున
నిన్ను కోలిచినా
ఎందుకో మరి దాహం మారదే
నేలపై నేరుగా దేవతై నువ్వే
వాలినావిలా లాలి పాడగా
నీ కలయికలో
మనసే వెలిగినదే
ఏంటా కోపమంతా
చూడలేను నీలోనా
నువ్వే దూరమైతే
మనసిది నిలిచేనా
అలగకే నాపైనా
ఉరమకే ఏమైనా
నిన్ను వీడి క్షణమైనా
నేను ఉండలేనన్నా
ఎవరే నీ కన్నా
నిన్ను నమ్ముకుని నేనున్నా
మాటలాడి మన్నించి
మరల కలిసిపోమన్నా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon