ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి
నందగోపుని కోడలా ముందు
తలుపు తీయవమ్మా
వేకువయ్యెను నిదురలెమ్మా
లోకనాధుని చూడనిమ్మా
మదగజమ్ముల మదమడించిన
కదనమందున కండలిరిచిన
సుదతులన్న ముదము చూపిన
నిదుర పోయిన నీరజాక్షుని మరదలా
విరుల నూనెల పరిమళించగ
కురులు కలిగిన నీల బాలా
మరుని సెగలను మరచి పోయి
త్వరగ తలుపు తీయవమ్మ
మేడ మిద్దెల గుడిసె గూనల
కోడిపుంజులు కొక్కొరొకొయన
మూక ఉమ్మడి మావికొమ్మల
కోకిలమ్మలు కుహు కుహు యన
బంతి చేతిలో పట్టి నీవు
సంతసించుచు ఏల రావు
కాళ్ళ గజ్జలు ఘల్లు ఘల్లన
కదలి వచ్చి గడియ తీయవమ్మా
ఎర్రతామర పూల వంటి
కరములందలి కంకణమ్ములు
ఎంతొ శృతిగా సవ్వడించగ
ఇంతి తలుపూ తీయుమా
నందగోపుని కోడలా ముందు
తలుపు తీయవమ్మా
వేకువయ్యెను నిదురలెమ్మా
లోకనాధుని చూడనిమ్మా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon