చిత్రం : పెళ్ళిసందడి (1959)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : సముద్రాల జూ.
గానం : పి.లీల, కె.రాణి
నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే
చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే
గోవర్థనగిరి గోటను నిలిపీ
గోవుల కాచినవాడే
కాళియనాగును కాలనురాచీ
కాచిన మగసిరివాడే
జలకములాడే గోపీజనులా
వలువలు దోచినవాడే
ఒంటరి పడుచుల పైటలులాగే
తులిపే తుంటరివాడే
బృందావని నీ ఆనందముతో
మైమరపించిన గోవిందుడే
మైమరపించిన గోవిందుడే
చల్లలనమ్మే పిల్లలనాపే
అల్లరిచిల్లరి గోపాలుడే
కడుపల్లదనాల గోపాలుడే
మోహన మురళీ గానముతో
హాయిని గొలిపే వాడే
అందెల చిందుల సందడితో
మది తొందర పరిచే వాడే
చిన్నగ చేరీ పాలూ పెరుగూ
వెన్నలు దోచేవాడే
వన్నెలు చేసీ కన్నెల వలపూ
మిన్నగ దోచేవాడే
మాయా పూతన మాయా కంసుని
హతమార్చిన మొనగాడే
మధురానగరికి మాతామహునీ
రాజును చేసినవాడే
అందరివాడే సుందరుడే
మన నందకిశోరుడు గోవిందుడే
మన నందకిశోరుడు గోవిందుడే
నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే
ఓఓఓఓఓ...హో.హో...
నల్లనివాడే చల్లనివాడే
పిల్లనగ్రోవీ గోపాలుడే
రేపల్లెకు వెలుగే గోపాలుడే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon